✍️✍️శ్రీనివాస్. అగ్నిధార ప్రతినిధి: కామారెడ్డి
తెరాస ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ కల్పన తన అనుచరులతో కలిసి టిఆర్ఎస్ లో చేరారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ MPTC అగ్గు కల్పన వారి అనుచరులతో కలిసి బాన్సువాడ నియోజకవర్గ అభవృద్ధి మరియు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి తెరాస పార్టీ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ ఖాండువలను కప్పుకున్నారు.
ఈ సందర్భంగా పోచారం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా మీడియా సొదరులందరికి జాతీయ పత్రిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం TRS పార్టీలో చేరిన వారందరికి ధన్యవాదాలు తెలిపి పార్టీకి మరింత బలం చేకూరేల సహాయ సహకారాలు అందించాలని కోరారు. అలాగే గత మూడు సంవత్సరాలలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి మూడు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ZPTC శంకర్ పటేల్,ఎంపీపీ వల్లేపల్లి సునీత,స్థానిక సర్పంచ్ సాయిబాబా,మండల పార్టీ అధ్యక్షుడు ఎజాజ్ ఖాన్,జిల్లా కో ఆప్షన్ సభ్యులు సిరజుద్దిన్,ఉపసర్పంచ్ శ్రీమతి సుజాత దేవేందర్, మాజి AMC చైర్మన్ నిరడి గంగాధర్,గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రావు,నాయకులు..వీరేశం,మాధవరావు,ఫరూక్, జుబెర్, శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
