జిల్లాలోని 263 గ్రామాలకు 21.04 కోట్ల ఆర్థిక సంఘం నిధులు విడుదల.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, మార్చి 07
పెద్దపల్లి జిల్లాలో ఉన్న గ్రామ పంచాయతీలకు 21 కోట్ల నాలుగు లక్షల రూపాయల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో ఉన్న 13 గ్రామీణ మండలాల పరిధిలో ఉన్న గ్రామాలకు 2023-24, 2024-25 సంవత్సరానికి సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు 13 జనవరి 2026, 17 ఫిబ్రవరి 2026, 26 ఫిబ్రవరి 2026 తేదీలలో మూడు విడతల్లో మొత్తం ఇప్పటి వరకు 21 కోట్ల 4 లక్షల రూపాయలు విడుదల కావడం జరిగిందని, ఇందులో అన్ టైడ్ గ్రాంట్ 5 కోట్ల 73 లక్షలు, టైడ్ గ్రాండ్ 15 కోట్ల 31 లక్షలు ఉన్నాయని తెలిపారు.
అన్ టైడ్ గ్రాంట్ నిధులతో సంబంధిత కరెంట్ బిల్లుల చెల్లింపు, జీతాల చెల్లింపు, ఇతర కార్యాలయ ఖర్చులు ఉంటాయని, టైడ్ గ్రాంట్ నిధులతో అభివృద్ధి పనులకు సంబంధించి వినియోగించడం జరుగుతుందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
