అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:

పెద్దపెల్లి సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ లో విజేత ధర్మారం జట్టు, రన్నర్ గా జూలపల్లి జట్టు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో గత రెండు రోజుల పాటు పెద్దపల్లి సబ్ డివిజన్ స్థాయి పోలీస్ వాలీబాల్ టోర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించడం జరిగింది. ఇట్టి వాలీబాల్ టోర్నమెంట్ లో విజేతగా ధర్మారం జట్టు, రన్నర్ గా జూలపల్లి జట్టు నిలవడం జరిగింది. విజేతలకు దీపక్ కుమార్ . IAS, addl కలెక్టర్ లోకల్ బాడీస్  అందచేశారు.ఈ సందర్భంగా దీపక్ కుమార్ . IAS,  మాట్లాడుతూ..క్రీడలు మానసిక ఉల్లాసం గురించి, మరియు శరీర దృఢత్వం గురించి క్రీడలు బాగా మేలు చేస్తాయని, సమయం దొరికినప్పుడల్లా వ్యాయామం చేయాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులకు సిబ్బందికి సూచించారు.క్రీడాకారులతో గంజాయి మత్తు పదార్ధాలకు దూరంగా ఉంటామని, ఈ ప్రాంతానికి అనువైన ప్రాంతంగా ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తామనిఅందరి బంగారు భవిష్యత్తును చిత్తు చేసే మాదకద్రవ్యాలకు  దూరంగాఉంటాం గంజాయి  రవాణా ను అడ్డుకుంటాం వాటిని యంత్రణకు పోలీసులకు అండగా ఉంటాం మత్తు  పదార్థాలు తీసుకోననీ ఎవరినీ తీసుకోనివ్వననీ, మత్తు పదార్థాల నుండి యువతను తద్వారా దేశాన్ని విముక్తం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆత్మ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను . ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిసిపి రవీందర్ ఏ సి పి సారంగపాణి సీఐ ప్రదీప్ కుమార్ అనిల్ కుమార్ ఎస్ ఐ లు రాజేష్ మహేందర్ ఉపేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.