ఐసీయూలో ఉన్న పాపను చూస్తూ.. తల్లడిల్లుతున్న  తల్లి.

అగ్నిధారన్యూస్, డెస్క్ :నవ మాసాలు మోసి.. పురిటి నొప్పులు భరించి.. ఒక బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. ఆ బిడ్డ భూమిపై పడగానే అప్పటి వరకు భరించిన ఆ పురిటినొప్పుల కష్టాన్ని,తన బిడ్డను తనివితీరా చూడగానే మర్చిపోతుంది తల్లి. అది మాతృమూర్తి గొప్పతనం.

కానీ ఆ తల్లికి ఆ బిడ్డ ప్రమాదంలో ఉందని తెలిసి ఆ తల్లి హృదయం తట్టుకోలేక పోతుంది.కామారెడ్డి జిల్లా బీర్కుర్ మండలం కిష్టాపూర్ మాతృగ్రామానికి చెందిన లావణ్య ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. తనకు పుట్టిన బిడ్డకు అయిదవ రోజు కామెర్ల వ్యాధి రావడంతో బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల తర్వాత పాప తీసుకునే ఊపిరి వేగం పెరగడంతో చాతి ఇన్ఫెక్షన్కు సంబంధించిన వ్యాధి ఉందని అక్కడ సరైన సదుపాయాలు లేవని,పాపకు సీరియస్ గా ఉందని మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ వెళ్లాలని సూచించగ, నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ మూడు రోజులు ఉన్నారు. ఆసుపత్రి సూపరిండెంట్ ప్రతిమరాజ్ పాప పై ప్రత్యేక శ్రద్ధ వహించి టుడిఈకో చేస్ట్ఎక్స్రే తీయించారు. పాపకు ప్రాబ్లంఉందని డాక్టర్లు హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. నిలోఫర్ ఆసుపత్రి వైద్యులు రిపోర్ట్స్ ని పరిశీలించి మరల ప్రైవేటు టెస్టులు చేయించారు. చాతిలో ఇన్ఫెక్షన్ ఉందని, పది రోజులు పడుతుందని చెప్పడంతో, అక్కడ వ్యక్తిగత సదుపాయాలు ఇబ్బంది పడుతూ పది రోజులు ఉండలేక  నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం అడ్మిట్ చేశారు. గత రెండు వారాలుగా తన పాపను పట్టుకుని హాస్పిటల్లచుట్టూ తిరుగి అలసిపోయిన లావణ్య, ఒంటరి మహిళ అయిన తనతల్లి అనిత మరియు కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు వేళలో ఖర్చు అవుతుండడంతో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. రేక్కడితే గాని డొక్కాడని.. కుటుంబం కావడంతో
మానవత్వమున్న దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని వారి మాతృకుటుంబం ఎదురుచూస్తుంది. Cell: 8008199884, 9490116143