కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అందరి మద్దతు కూడగడతా….. అగ్నిధారన్యూస్, పెద్దపల్లి :పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలోని స్థానిక సిరి ఫంక్షన్ హాల్ లో ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ విలేకరులతో సమావేశమై అయ్యారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచి ఎన్నికల క్యాపనింగ్ లో భాగంగా మొదటిసారి పెద్దపల్లి గడ్డమీద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులతో సమావేశం కావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమకాలంలో పార్టీకి కెసిఆర్ కి కరీంనగర్ నుండి వెన్నుదన్నుగా ఉండి పార్టీ అభివృద్ధికి పని చేశానన్నారు .అయినప్పటికీ పార్టీలో సరైన ప్రాధాన్యత నాకు కల్పించలేదు అన్నారు .నన్ను మభ్య పెట్టడానికి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడానికి ముందు వరకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానంటూ గత రెండు మూడు పర్యాయాలుగా నమ్మ పలుకుతూ నమ్మక ద్రోహం చేశారన్నారు. ఈసారి కేసీఆర్ మాటలపై నమ్మకం లేకనే ఎమ్మెల్సీ బరిలో నిలిచాను అన్నారు. అన్ని పార్టీల మద్దతు నా గెలుపు కొరకు ఉందన్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు తాగుతాను అన్నారు. హుజురాబాద్ లో టిఆర్ఎస్ కి ఎలాంటి పరాభవం ఎదురుఅయిందో, ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడ నా గెలుపుతో నిరూపితమవుతుంది అన్నారు .నేను అన్ని పార్టీల మద్దతును కోరుతున్నానన్నారు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం పోరాడతానని అన్నారు. గెలిచాక బిజెపి పార్టీలోకి చేరుతారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు సాగుతానని సూటిగా సమాధానం చెప్పారు.
ఈ సందర్భంగా ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన బిజెపి ఎంపీటీసీ శ్రీనివాస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ ను కలిసి మద్దతు ప్రకటించారు. పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య ఎమ్మెల్సీ అభ్యర్థిని కలిశారు.
