దేవుని పల్లి జాతర ఆదాయం లెక్కింపు  కార్యక్రమంలో  సిబ్బంది

అగ్నిధారన్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం దేవుని పల్లి గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవం 16.11.2021 నుండి 25.11.2021 వరకు ఘనంగా జరిగినటువంటి విషయం విధితమే 29.11.2021  సోమవారం రోజున శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వివిధ రూపాల్లో చేకూరిన  ఆదాయ లెక్కింపు కార్యక్రమం ఆలయ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఆధ్వర్యంలో చేపట్టారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి భక్తులు సమర్పించుకున్న కానుకలు  హుండీ ద్వారా 438335 రూపాయలు, టెండర్ల ద్వారా381200 రూపాయలు, టిక్కెట్ల ద్వారా154624 రూపాయలు. మొత్తం రూపాయలు 974159, అదేవిధంగా బంగారం 580 గ్రాములు వెండి 590 గ్రాములు  చేకూరాయని,ఆలయ E O ముద్దసాని శంకర్ తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రావి శెట్టి కిషన్ ఎంపీటీసీ పందిళ్ళ లక్ష్మణ్ అందులపల్లి సర్పంచ్ కారే శారద శ్రీనివాస్, ఆలయ అర్చకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.