బిగ్ బ్రేకింగ్ న్యూస్
ఏసీబీకి పట్టుబడ్డ పెద్దపల్లిఆర్డిఓ శంకర్ కుమార్
అగ్నిధార న్యూస్ పెద్దపల్లి లంచగొండి రెవెన్యూ అధికారి ఏసీబి అధికారుల చేతికి చిక్కాడు. మంగళవారం పెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్ గోదావరిఖనికి చెందిన కాంట్రాక్టర్ రజినీకాంత్ నుండి లక్ష రూపాయలు లంచం మధ్యవర్తి ద్వారా తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈరోజు పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి ఆఫీసులో రామగుండం కార్పొరేషన్లో హైడ్రోక్లోరైడ్ ద్రావణం కాంట్రాక్టర్ రజినీకాంత్ కరోనా ఆ సమయంలో రామగుండం కార్పొరేషన్లో కాంట్రాక్ట్ వర్క్ చేశారు దానికి సంబంధించిన 9 లక్షల 28 వేల రూపాయలు బిల్లు రావాల్సి ఉంది రామగుండం కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ గా వ్యవహరిస్తున్న పెద్దపెల్లి ఆర్డీవో శంకర్ కుమార్ డిమాండ్ చేశారు లక్ష రూపాయలు ఇవ్వడం ఇష్టం లేని కాంట్రాక్టర్ రజినీకాంత్ ఏ సి బి ని ఆశ్రయించి మధ్యవర్తి ద్వారా లక్ష రూపాయలు ఇస్తున్న ఈ క్రమంలో లో ఏ సి బి దాడి చేసి పట్టుకున్నారు.
