గోదావరిఖని,అగ్నిధారన్యూస్: తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో ,కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మికవ్యతిరేక  విధానాలకు, సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేఖంగా కార్మికులు ఇచ్చిన బంద్ పిలుపు కు రామగుండం నియోజకవర్గం, గోదావరిఖని పట్టణంలోని GDK 2 ఇంక్లైన్ గనిపై తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి సంఘీభావంగా మంత్రి హాజరై మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు గని కార్మికుల పట్ల కనబరుస్తున్న నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నా నన్నారు. కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని లేనట్లయితే కార్మిక లోకం ఆగ్రహానికి కేంద్ర ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో తనతో పాటు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వెంకటేష్ , రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ , పెద్దపెల్లి శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు.