అగ్నిధార ప్రతినిధి లైన్స్ క్లబ్  పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో ఇటుక బట్టీల లో నివసిస్తున్న 200 కార్మికులకు అన్నదాన కార్యక్రమం*. లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ *Douglas Alexander* జన్మదిన సందర్భంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ *నాగుల సంతోష్* గారి పిలుపు మేరకు *#AP forvp*, నినాదంతో *హంగర్ రిలీఫ్ సర్వీస్* యాక్టివిటీస్ అక్టోబర్ 10 నుండి 18 తారీకు వరకు నిర్వహించాలని ఆదేశం మేరకు కార్యక్రమంలో భాగంగా ఈరోజు లైన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో ఇటుక బట్టీల లో నివసిస్తున్న 200 మందికి కార్మికులకు దుర్గా నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం లో మిగిలిన ఆహారాన్ని కార్యక్రమంలో భాగంగా ఇటుక బట్టీల వద్దకు వెళ్లి అన్న వితరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు చంద్రగిరి వంశీ రాజ్, జోన్ చైర్ పర్సన్ డాక్టర్ అశోక్ కుమార్, క్లబ్ సర్వీస్ చైర్ పర్సన్ సతీష్ రెడ్డి, లియో నెంబర్ సాయి హర్షిత్ పాల్గొన్నారు