పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం రోజున మహనీయుల ఆశయ సాధన సంఘం అధ్యక్షుడు బొంకురి కైలాసం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయం వెనకాల సర్వేనెంబర్ 708 లో ప్రభుత్వ భూమి 30 గుంటల స్థలం అంబేద్కర్ కమ్యూనిటీ భవనం కోసం 2019లో అప్పటి కలెక్టర్ దేవసేన మంజూరు చేశారన్నారు. ఈ స్థలంలో భవన నిర్మాణం కోసం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి భూమి పూజ కార్యక్రమం కూడా చేశారన్నారు. మున్సిపాలిటీ అనుమతితో అంబేద్కర్ కమ్యూనిటీ భవన నిర్మాణ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ,శ్రీ కృష్ణ గోశాల నిర్వాహకులు ఈ స్థలం గోశాల దని కోర్టుకు వెళ్లి స్టే తీసుకురాగా, భవన నిర్మాణ పనులు నిలిపి వేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా సమస్య పరిష్కరించ బడలేదు కాబట్టి తేదీ 15.12.2021 రోజున కలెక్టర్ సంగీత సత్యనారాయణను కలిసి సమస్య త్వరితగతిన పరిష్కరించాలని వినతి పత్రం ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి దాసరి దశరథం ,బింగి రాజు, వడ్డేపల్లి రాజు, తుంగ రాజు భూంపల్లి రాజు, గాలి ప్రభాకర్, మోరే రమేష్, చాట్ల బాపు. లక్ష్మీరాజాం, తదితరులు పాల్గొన్నారు.
