ఏఐఎస్ఎఫ్ పోరాట ఫలితంగా పిఈటి ని సస్పెండ్ చేసిన విద్యాధికారులు.

విద్యా సంస్థలలో చదువుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులకు అన్యాయం జరిగితే ఏఐఎస్ఎఫ్ ఊరుకోదు

ఏఐఎస్ఎఫ్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు రేణుకుంట్ల ప్రీతం

రామగుండం,అగ్నిధారన్యూస్: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ,గోదావరిఖని సప్తగిరి కాలనీలో ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను అకారణంగా చితక బాదిన పిఈటి ని సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ నగర సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని, సంబంధిత విద్యాశాఖాధికారులను డిమాండ్ చేయడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు రేణుకుంట్ల ప్రీతం ఒక ప్రకటనలో తెలిపారు. ఏఐఎస్ఎఫ్ నగర సమితి పక్షాన విద్యార్థులకు జరిగిన అన్యాయం పై స్పందించి గురుకుల పాఠశాల ముందు ఆందోళన చేపట్టడం జరిగిందని, సోమవారం బాలుర గురుకుల పాఠశాల ముందు ఆందోళన చేస్తున్న సమయంలో గోదావరిఖని వన్ టౌన్ ఎస్సై మరియు ప్రధానోపాధ్యాయులు వచ్చి పిఈటి కి సస్పెండ్ ఉత్తర్వులు కాపీ ని అందజేసి, పాఠశాల నుండి పిఈటి బయటి కి పంపించారని ఆయన పేర్కొన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆందోళన ఫలితంగానే ప్రభుత్వం పిఈటి ని సస్పెండ్ చేయడం జరిగిందని ఆయన అన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలో చదువు కుంటున్న విద్యార్థిని, విద్యార్థులకు ఫీజుల విషయం లో గాని, చదువు ల విషయంలో లో గాని అన్యాయం జరిగితే ఏఐఎస్ఎఫ్ ఊరుకోదని, విద్యార్థుల పక్షాన పోరాటాలకు స్వీకారం చుడుతామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులను అకారణంగా ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని ఆయన అన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో చదువు కుంటున్న విద్యార్థిని, విద్యార్థులకు ఏఐఎస్ఎఫ్ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు రమేష్, రాజు, రవికుమార్, శ్రీనివాస్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.