క్యానర్స్ బాధితులకు అండగా ఉంటాం గోదావరిఖని,అగ్నిధారన్యూస్: గోదావరిఖని పట్టణంలో బుధవారం ఎమ్మెల్యే  క్యాంపు కార్యాలయంలో విజయమ్మ పౌండేషన్ అధ్వర్యంలో స్వర్గీయ కోరుకంటి విజయమ్మ 3 వర్ధంతి సందర్భంగా  క్యాన్సర్  భాదితులకు ఒక్కోక్కరికి 521 రూపాయలు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అందించారు. క్యానర్స్ వ్యాది బాధితులకు అండగా ఉంటామని  అన్నారు.   క్యాన్సర్ బారిన పడిన వారి జీవితాలు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని అన్నారు, వారికి ఆసరాగా, భరోసాగా నిలిచేందుకు విజయమ్మ పౌండేషన్ ద్వారా ప్రతి నెల సహాయం అందించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుామార్ జడ్పిటిసి అముల నారాయణ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు ,కార్పోరేటర్లు ఇంజపురి పులిందర్, బాలరాజ్ కుమార్, దాతు శ్రీనివాస్, కోమ్ము వేణుగోపాల్, కో ఆప్షన్ సభ్యురాలు తస్నీంభాను నాయకులు కాల్వ శ్రీనివాస్ విజయమ్మ పౌండేషన్ బాధ్యులు ఎడెల్లి శ్యాం, అబ్బ రమేష్ ,  తదితరులు పాల్గొన్నారు.