పెద్దపల్లి,అగ్నిధారన్యూస్ :బుధవారం రోజున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్దపెల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 3816కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్ మెంట్ ,స్కాలర్ షిప్స్ వెంటనే విడుదల చేయాలని పెద్దపల్లి కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు.ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ నెంబర్ ఊషణ అన్వేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న మాదిరిగా విద్యారంగ సమస్యలు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు,నియామకాలు మనకు చెందుతాయని అనేకమంది విద్యార్థులు ఆత్మబలిదానం చేస్తే ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం విద్యార్థుల సమాధుల మీద పునాదులు నిర్మించుకోని విలాసవంతమైన. జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు.ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కి చీమకుట్టినట్టు లేదన్నారు.వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యోగ నోటిఫికేషన్, రియంబర్స్ మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కళాశాల బాలుర,బాలికల సమీకృత వసతి గృహాలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ కోడి అజయ్,నగర కార్యదర్శులు మారం సందీప్,రిషి,SFS జిల్లా కన్వీనర్ రాసూరి ప్రవీణ్,SFD జిల్లా కన్వీనర్ రేచవేణి సాగర్,జిల్లామీడియా కన్వీనర్, మేడారంసాయికృష్ణ,నాయకులు,బండిరాజశేఖర్, సాయితేజ,మనీషా,సాయి,నాగచంద్ర,ఓమెష్,బన్ని,బాలు,పవన్,అర్జున్, తదితరులు పాల్గొన్నారు.