రామగుండం నగర పాలక అవినీతి ని అక్రమలను అరికట్టాలని సిపిఐ వినతి. ✍️✍️✍️…..A. రాజేశ్ గోదావరిఖని,అగ్నిధారన్యూస్: గురువారం రోజున సిపిఐ నగర కార్యదర్శి కె.కనకరాజ్, సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ రామగుండం నగర పాలక సంస్థకు నూతనగా ఇంచార్జ్ కమిషనర్ గా విచ్చేసిన బి.సుమన్ రావును మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్కను ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం సిపిఐ పక్షాన నగర పాలక సంస్థలో జరుగుతున్న అవినీతి అక్రమాలను అరికట్టాలని వినతి పత్రం ఇవ్వడం జరిగిందిన్నారు. అనంతరం అవినీతికి చిరునామా రామగుండం నగర పాలక సంస్థ అని అసలు కార్పొరేషన్ ను పరిపాలిస్తున్నది ప్రజా ప్రతినిధులా లేక కాంట్రాక్టర్లా అని అన్నారు. ఇక పోతే కొంతమంది కాంట్రాక్టర్లు పెత్తనం కొనసాగుతుందని చేయని పనిని చేసినట్లుగా సృష్టించి అధికారులను భయపెట్టి, బ్లాక్ మెయిల్ చేస్తూ కొంత పని చేసి మొత్తం పని చేసినట్లు తప్పుడు ఫైల్స్ సృష్టించి, అక్రమంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న అనేక ఆరోపణలు ఉన్నాయని వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రణాళిక పనులు కొన్ని ప్రక్కదారిన పట్టాయని అదే విధంగా హరిత హారం కోసం మరియు శానిటేషన్ విభాగం ద్వారా చేపట్టిన నామినేషన్ ఫైల్స్ రూపంలో ఎర్ర మట్టి సరఫరా, శానిటైజర్ స్ప్రే, ట్రాక్టర్లును సమకూర్చడం, జేసీబీలు మరియు వివిధ పనుల పేరుతో తప్పుడు ఫైల్స్ సృష్టించి అధికారులను కొంత మంది కాంట్రాక్టర్లు తప్పుద్రోవ పట్టించి ప్రజాధానానాన్ని తమ జేబులో వేసుకొనికి ప్రయత్నం చేస్తున్నారని వివరించడం జరగిందన్నారు. వివిధ పనులకు సంబందించిన ఫైల్స్ ను కొంతమంది మాయం చేసినట్లు సమాచారం మరియు వివిధ పత్రికలలో కూడా రాయడం జరిగిందన్నారు. కొన్ని ఫైల్స్ లేనివి ఉన్నట్లు సృష్టించి బిల్లులు తీసుకుందామని ప్రయత్నంలో కొందరు కాంట్రాక్టర్లు ఉన్నారని అట్టి ఫైల్స్ ను అన్ని హోల్డ్ లో పెట్టి క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే బిల్లు జారీ చేయాలని సిపిఐ తరుపున కోరడం జరిగిందన్నారు. యుద్ధ ప్రాతిపదికన చెప్పట్టాల్సిన నామినేషన్ పనులను ఇంజనీరింగ్ అధికారులు, డెప్యుటేషన్ పై వచ్చి సమయం పూర్తి అయిన వెళ్లకుండా పాతుకపోయిన శానిటేషన్ విభాగం ఇన్స్పెక్టర్ బినామీ కాంట్రాక్టర్లగా చెలామణి అవుతూ కాంట్రాక్టర్లతో కుమ్మకై సుమారు 2కోట్లు రూపాయల పై చిలుకు పనులను షార్ట్ టెండర్లు పిలిచే అవకాశం ఉన్నప్పటికీ ఒక్కొక్క ఫైల్ ను లక్ష రూపాయలుగా విబిజించి 200ల కు పైగా పైగా ఫైల్స్ తయారు చేయడం వీళ్ళ అవినీతికి పరకాస్టగా మిగిలిపోతుందన్నారు. డిప్యుటేషన్ పైవచ్చిన అవినీతి శానిటేషన్ అధికారిని నిజమైన విచారణ చేపడితే అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. అదే విధంగా రామగుండం నగర పాలక సంస్థలోని పాత మునిసిపల్ కార్యాలయం లోని స్క్రాప్ మాయం అయిన ఇంత వరకు ఎలాంటి చర్యలు కానీ విచారణ కానీ జరపడం లేదు, అధికారులు పొలిస్ కాంప్లేన్ట్ ఇచ్చిన ఎలాంటి పురోగతి లేదు, కావున స్క్రాప్ కుంభకోణం సుమారు 70 లక్షల నుండి 80 లక్షల వరకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసారని అన్నారు. దాని పై సమగ్ర విచారణ చేయాలని కోరారు. అదే విధంగా కార్పొరేషన్ ద్వారా గోదావరి బ్రిడ్జి పై పెన్షింగ్ పనులు ఆగిపోవడం వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయని యుద్ధ ప్రాతిపదికన పెన్షింగ్ పనులు వెంటనే ఏర్పాటు చేయాలి అని సిపిఐ పక్షాన కోరామని తెలిపారు. .
