హైదరాబాద్,అగ్నిధారన్యూస్: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన నల్ల రాజిరెడ్డి హైదరాబాద్ నగరంలోని రోడ్డు ప్రమాదానికి గురై గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శనివారం రోజున మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు.ఆయన ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
మంత్రి వెంట రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తదితరులు ఉన్నారు.
