పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి మండలం ముత్తారం ధర్మాబాద్ గ్రామాలకు ఆదివారం రోజున పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి.  సిసి రోడ్ల నిర్మాణానికి SDF నిధుల నుండి 34 లక్షల ఇరవై వేల రూపాయల రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. రోడ్లు మంజూరు చేసి గ్రామంలో మౌలిక వసతులు కల్పించిన ఎమ్మెల్యే దాసరికి ముత్తారం గ్రామ సర్పంచి ఎద్దు కుమారస్వామి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ గౌడ్  అనంత రెడ్డి కీర్తి రాజయ్య గ్రామపంచాయతీ పాలకవర్గం టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు