పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం సమయంలోతవేరా వాహణం హోండా సిటీకారు ఎదురెదురుగా డీకొనడంతో తవేరాలోప్రయాణం చేస్తున్న నలుగురుకి తీవ్రగాయాలు కాగా గాయపడినవారిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం గోదావరిఖని నుండి ఓదెల మల్లన్న దర్శనానికి తవేరా వాహణంలో బయలు దేరిన 8 మంది భక్తులు ,వరంగల్ నుండి హోండా సిటి కార్ లో పెద్దపల్లి కి వస్తున్న 6గురు యువకుల కారు అతివేగంతో వచ్చి డీకొట్టడంతో ఈ సంఘటన జరిగిందని తెలిపారు. 
