తెలంగాణ రాష్ట్ర గౌడ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడుగా బందారపు అజయ్ కుమార్ గౌడ్. కరీంనగర్అగ్నిధారన్యూస్: తెలంగాణ రాష్ట్ర గౌడ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షులుగా బందారపు అజయ్ కుమార్ గౌడ్ నియామకంచేస్తూ ఆసంఘం రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎడ్యుకేషన్ కార్పొరేషన్ చైర్మన్ ,నాగేందర్ గౌడ్ నియామక పత్రాన్ని. అజయ్ కుమార్ గౌడ్ కు అందజేశారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకంతో ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రాష్ట్ర నాయకత్వానికి అదేవిధంగా గౌడ కులస్తుల అందరికీ రుణపడి ఉంటాను అన్నారు. నిత్యం గౌడ కులస్తుల సంక్షేమ కోసం అందరి సహాయ సహకారాలతో అహర్నిశలు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ మరియు టి ఆర్ ఎస్ నాయకులు బంధారపు అజయ్ కుమార్ గౌడ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.
