✍️  ✍️  ✍️వోల్లాల జలంధర్ గౌడ్.

జగిత్యాలజిల్లా,అగ్నిధారన్యూస్: దేశంలో ఎక్కడా లేని విధంగా క్రిస్మస్, రంజాన్ మరియు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకునే గొప్ప సంస్కృతి ఒక్క తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.క్రిస్మస్ కానుకలు పంపిణీ చేస్తున్న మంత్రి వెల్గటూర్ మండలం రాజారాంపల్లి గ్రామంలోని ఎస్.ఆర్. గార్డెన్ లో ఏర్పాటు చేసిన ధర్మపురి నియోజకవర్గ స్థాయి క్రిస్మస్ పండుగ సంబురాలు కార్యక్రమంలో 3000 మంది లబ్దిదారులకు దుస్తులు, గిఫ్టులను జిల్లా పరిషత్ చైర్మన్, కలెక్టర్ మరియు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా, తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే క్రిస్మస్ పండుగను ప్రభుత్వమే నిర్వహిస్తుందని, గతంలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి క్మిస్మస్ పండుగ కార్యక్రమంలో పాల్గోని క్రైస్తవులకు అండదండలను అందించడం జరుగుతుందని పేర్కోన్నారు. ధర్మపురి నియోజక వర్గంలోని 6 మండలాకు చెందిన క్రైస్తవ సోదరులతో క్ర్మిస్మస్ సంబురాలను ఘనంగా నిర్వహించుకోవడంతో పాటు, పండుగను సంతోషంగా జరుపుకునే విధంగా క్రైస్తవులకు కొత్త బట్టలను అందించడం జరుగుతుందని పేర్కోన్నారు.క్రిస్మస్ సంబరాల్లో మంత్రి ఇ ఇ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా వెతికిన దొరకదని. అన్ని మతాలకు సమాన ప్రాతినిద్యం కల్పిస్తూ, హైదరాబాద్ లో క్రిస్టియన్ భవన్ నిర్మాణం కొరకు స్థలంతో పాటు, నిధులను కూడా మంజూరు చేయడం జరిగిందని, క్రైస్తవ సోదరులకు ఎల్లవేలలా కొండంత అండగా ఉంటానని మంత్రి హామి ఇచ్చారు. జిల్లా పరిషత్ చైర్పెర్సన్ శ్రీమతి దావ వసంత మాట్లాడుతూ, పేదల అభ్యున్నతికి అనుదినం కృషి చేస్తూ, కేవలం పండుగ కిట్ లను అందించడం మాత్రమే కాకుండా అడగక ముందే అనేక మంది పేదల అభ్యున్నతికి నిధులను మంజూరు చేస్తూ, అనుక్షణం జిల్లా అభివృద్దిని కాంక్షిస్తున్న రాష్ట్ర మంత్రి కోప్పుల ఈశ్వర్ ఈ సందర్బంగా కృతజ్ఞతలను తెలియజేశారు.
భిన్నత్వంలో ఏకత్వంగా సర్వమతాల సమ్మేళనంగా ఉన్న భారతదేశంలో అందరి అభ్యున్నతిని కాంక్షిస్తు అన్ని మతాలను ఐక్యం చేస్తూ, అందరు సోధరభావంతో మెదిలేలా క్రిస్మస్, రంజాన్, బతుకమ్మ పండుగలకు బహుమతులను ప్రదానం చేయడం మాత్రమే కాకుండా, .జిల్లా కలెక్టర్ జి. రవి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక అనేక పండుగలను, రాష్ట్ర పండుగలుగా గుర్తించడం జరిగింది, అన్నారు. 2015 నుండి ప్రతి క్రిస్మస్ పండుగకు పేద, భీదలకు బహుమతులను పంపిణి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని పేర్కోన్నారు. జిల్లాలోని నియోజక వర్గాలలో 1000 చోప్పున కిట్ లను పంపిణి చేయగా, దర్మపురి నియోజకవర్గంలో 3వేల కిట్ లను పంపిణి చేయడం జరిగిందన్నారు, రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లాలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి ఉండడం వలన సంమృద్దిగా నిధులు మంజూరు చేసుకోవడం జరుగుతుందని, అదే విధంగా జిల్లా కేంద్రంలో జనవరి 1 నుండి ఎస్సి స్టడి సర్కిల్ ప్రారంభించుకోవడం జరుగుతుందని, దీని ద్వారా నిరుద్యోగ యువతి యువకులకు పోటి పరీక్షలకు సిద్దం చేయడం జరుగుతుందని తెలుపుతూ, ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డి.డబ్ల్యూ.ఓ.నరేష్ డి.యం.డబ్ల్యూ.ఓ. డి. సుందరవరదరాజన్, జట్పిటిసి బి. సుధారాణి, టిఎస్, యంపిటిసిల ఫోరం అధ్యక్షులు పోడెటి సతీష్ గౌడ్, స్థానిక సర్పచ్ శేఖర్, టిఎస్ పిస్ చైర్మన్ గూడ రాంరెడ్డి, మండల అధ్యక్షురాలు సిందుజారెడ్డి. కోఆప్షన్ మెంబర్ రియాజోద్దిన్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఫాస్టర్లు, ప్రజలు పాల్గొన్నారు.