నిషేదిత పొగాకు ఉత్పత్తులు పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
గోదావరిఖని,అగ్నిధారన్యూస్: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కేంద్రం లోని మార్కండేయ కాలనీ నిషేదిత పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నారు అనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్,సిబ్బంది శ్రీనివాస్, మల్లేష్ తో కలిసి గోదావరిఖని పట్టణం లో మార్కండేయ కాలనీ , భాస్కర్ కిరాణం లో తనిఖీ నిర్వహించగా రూ: 10,800 రూపాయల విలువ గల ప్రభుత్వ నిషేదిత పొగాకు ఉత్పత్తులు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకొని షాప్ యజమాని అయిన రంగ భాస్కర్ s/o లక్ష్మి రాజాం,41yrs,R/o, మార్కండేయ కాలనీ, గోదావరిఖని ని అదుపు లోనికి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
