పెద్దపల్లి అగ్నిధార న్యూస్ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలో బుధవారం రోజున పెద్దపల్లి ఏసిపి సారంగపాణి ఆధ్వర్యంలో విస్తృత అవగాహన చేపట్టారు.కరోన మహమ్మారి   విజృంభిస్తున్న క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని  ఏసీపీ సారంగపాణి పిలుపునిచ్చారు.  జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా , మసీద్ , మార్కెట్ యార్డ్ ప్రాంతాలలో మాస్కు వినియోగంపై అవసరం గురించి తెలిపారు. పట్టణంలో  పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. మాస్క్ ప్రస్తుత పరిస్థితులలో ప్రజలందరికీ రక్షణ కవచం లాంటిదని, తప్పనిసరిగా వినియోగించాలన్నారు. ఇకపై తరచూ తనిఖీలు నిర్వహిస్తామని మాస్కు ధరించకపోతే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని అన్నారు . ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ తరచూ శానిటైజర్ వినియోగించి చేతులు శుభ్రం చేసుకోవాల‌ని, రద్దీ ప్రదేశాల్లో భౌతిక దూరం కచ్చితంగా పాటించాలన్నారు. కొత్త వేరియంట్   ఒమిక్రన్   దృష్టిలో పెట్టుకొని.  కోవిడ్, నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. నిబంధనలకు  విరుద్ధంగా  ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. క‌రోనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ అవ‌గాహ‌న కార్యక్రమంలో సీఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్ , ఎస్ఐ లు రాజేష్, రాజ వర్ధన్, సహదేవ్ సింగ్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.