పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలకు పెద్దపల్లి జెడ్ పి టి సి బండారు రామ్మూర్తి బుధవారం రోజున 10,000/- రూపాయలు విరాళం అందజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు నూతన భవన నిర్మాణం కొరకు ఈరోజు ₹10,000/- రూపాయలు పాఠశాల అభివృద్ధి కమిటీ కి అందజేయడం జరిగింది , అన్నారు. పాఠశాల నూతన భవన నిర్మాణం కొరకు రాజకీయ నాయకులు వర్తక సంఘాలు తమ యొక్క విరాళాలు అందించి పాఠశాల అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ అధ్యక్షులు శశాంక్ డాక్టర్ అశోక్ కుమార్ సతీష్ రెడ్డి శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య పాల్గొన్నారు.
