ధర్మారం,అగ్నిధారన్యూస్ :పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలవనపర్తి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న జియో టవర్ నిలుపుదల చేయాలని,ధర్మారం మండలం నర్సింగపూర్,  ఖిలవనపర్తి,కొత్తూరు ,కటికెనపల్లి,బొమ్మారెడ్డి పల్లి గ్రామాల్లో అన్యాక్రాంతం అయిన ప్రభుత్వ భూములను కాపాడాలని,ఇట్టి భూములపై క్రయవిక్రయాలపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ భూములు పట్టాలు చేసుకున్న వారి పట్టాలు రద్దు చేయాలని కోరుతూ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్-కరీంనగర్, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ కి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ధర్మారం మండల అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, పత్తి పాక ఎంపీటీసీ సభ్యులు బద్దం అజయ్ పాల్రెడ్డి,మోతె కృష్ణ, నూనె నాగస్వామి,చెన్నూరి సతీష్,సామంతుల రవి,మోతె వెంకటేష్,మోతె రాములు,బొబ్బిలి రాకేష్ తదితరులు పాల్గొన్నారు