కరీంనగర్ అగ్నిధారన్యూస్: ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శనివారం రోజు పెద్దపెల్లి ఏసిపి సారంగపాణి, సీఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేన రెడ్డిలు మంత్రి క్యాంపు కార్యాలయం కరీంనగర్ లో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

 

నేరెళ్ల- గోవిందపల్లి శ్రీ సాంబ శివున్ని దర్శించుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్

జగిత్యాల అగ్నిధార న్యూస్ శనివారం రోజు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని నెరేళ్ళ- గోవిందుపల్లి శ్రీ సాంబశివ ఆలయ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్,ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో పాడిపంటలతో చల్లగా ఉండాలని దేవుని కోరుకున్నాం అన్నారు . ఆయనకు పండితులు వేదమంత్రోచ్ఛారణతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత ఉన్నారు .