గోదావరిఖని,అగ్నిధారన్యూస్: తెలంగాణ రాష్ట్రం లో దండుగన్న వ్యవసాయన్ని పండగగా మార్చి రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రైతుల గుండెల్లో దేవుడు నిలిచారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అంతర్గాం మండలం అంతర్గాం గ్రామంలో రైతుబంధు సంబరాల్లో బాగంగా రైతులు తమ ఇల్ల ముందు రైతు బంధు పధకంతో కూడిన ముగ్గులను ప్రదర్శించారు. ఎమ్మెల్యే ముగ్గులను తిలకించి మాట్లాడుతూ.దేశానికి ఆదర్శం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అమలుపరుస్తున్న రైతు సంక్షేమ పథకాలు… దేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టి అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ప్రవేశపెట్టి రైతుకు వెన్నుముకగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిలిచారు అన్నారు. రైతులను రాజుగా చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంగా        ముందుకు సాగుతుందని, తెలంగాణ అన్నదాతకు ఆపద్భాందవుడిగా   ముఖ్యమంత్రి కెసిఆర్ నిలిచారని అన్నారు. తెలంగాణ రైతాంగానికి ఉచితంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ రైతుబంధు రైతుబీమా సకాలంలో ఎరువుల పంపిణీ చేస్తు రైతన్న కళ్లలో అనందం నింపిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దే అన్నారు.ఈ కార్యక్రమంలో అంతర్గాం మండల ఎంపీపీ దుర్గం విజయ జడ్పీటీసీ అముల నారాయణ వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి మహేందర్ రెడ్డి సర్పంచులు ధరనీ రాజేష్ బండారి ప్రవీన్ తుంగపిండి సతీష్ కో ఆప్షన్ సభ్యులు గౌస్ పాషా నాయకులు కోల     సంతోష్ గౌడ్ , శ్రీనివాస్ రెడ్డి తిరుపతి నాయక్ వ్యవసాయాధికారి రాంబాబు పాల్గొన్నారు.