రామగుండం నియోజకవర్గ సమస్యల పై సిపిఐ నేత మద్దెల దినేష్ గవర్నర్ కి ఫిర్యాదు..

రాజ్ భవన్ గ్రీవెన్స్‌ బాక్సులో లేఖ..

గోదావరిఖని అగ్నిధార న్యూస్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రాజ్ భవన్ ముందు ఏర్పాటు చేసిన గ్రీవిన్ బాక్స్‌లో రామగుండం నియోజకవర్గ సమస్యల పై ఫిర్యాదు చేశారు. సిపిఐ రామగుండం నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ అనంతరం  మాట్లాడుతూపెద్దపల్లి  జిల్లా రామగుండం నియోజకవర్గంలోని రైతుల సౌకర్యార్ధం కోసం ప్రభుత్వ పరంగా మార్కెట్ యార్డు కూడా లేదని, అదే విధంగా కూరగాయలను, పండ్లను ఎక్కువగా నిలువ ఉంచడానికి శీతల గిడ్డంగులు (కోల్డ్ స్టోరేజ్ )లు ఏర్పాటుచేయాలని కోరామన్నారు.నూతనంగా ఏర్పాటు  చేసిన జిల్లాలో భాగంగా గోదావరిఖనిలోని జవహర్ నవోదయ విద్యాలయం (జెఎన్వి) ఏర్పాటు చేయాలని మరియు పాల్టెక్నిక్ కళాశాల ఏర్పాటుచేయాలని కోరడం జరిగిందన్నారు. ముఖ్యంగా  నియోజకవర్గంలోని గోదావరిఖని ప్రాంతంలో గోదావరినదిలోని నీరు మొత్తం కలుషితమై ప్రజల ప్రాణాలకు ముప్పు కల్గుతుందని, రోగాల బారిన పడి ఆస్పత్రులలో చేరుతున్నారని ఈ కలుషిత నీరు వల్ల చర్మవ్యాధులు మరియు జాండీస్ కు దారితీస్తున్నాయన్నారు.కలుషిత నీరు వల్ల  స్థానిక ప్రజా ప్రతినిధులకు పట్టింపు కూడా లేదని, కనీసం నోరు మెదపడం లేదన్నారు.ముఖ్యంగా స్థానిక పరిశ్రమల లోని ముక్యంగా ఆర్ఏఫ్సిఎల్ రసాయనాలతో కూడిన నీరుమరియు గోదావరిఖని వివిధ ప్రధాన కలువల్లోని మురుగు నీరు నేరుగా గోదావరి నదిలోకి ప్రవేశిస్తుందని, వీటి వల్ల గోదావరి నీరు కలుషితమై ఒకపాయలాగాఏర్పడుతుందన్నారు. కేవలం ఇక్కడ నీటి శుద్ధి కేంద్రాలు ఉన్నపటికీ అవి నిరుపయోగంగా ఉన్నాయని కావున నూతన నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయాలని పేర్కొన్నారు.అదే విధంగా రామగుండం నగరపాలక సంస్థ అంటేనే అవినీతికి చిరునామాగా మారిపోయిందని , నగరపాలక సంస్థలోని అన్ని శాఖల్లో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని,రామగుండం నగరపాలక సంస్థకు యుద్ధ ప్రాతిపదికన ఐఏఎస్ అధికారిని రామగుండం నగరపాలక సంస్థకమీషనర్ గా నియమించాలని కోరమన్నారు . ఐఏఎస్ అధికారిని నియమిస్తేనే అవినీతి జరగకుండా అభివృద్ధి సాధ్యమవుతందని అన్నారు.రామగుండం ఫెర్టిలైజర్ కార్పోరేషన్ లిమిటెడ్  (ఆర్ఎఫ్సీఎల్ ) లో నిరుద్యోగులను ఆసరాగా చేసుకొని అధికార పార్టీ నేతల అందండలతో ఉద్యోగాల పేరిట ఒక్కొ ఉద్యోగాన్ని రూ: 7 లక్షల నుంచి రూ: 10 లక్షల వరకు అమ్ముకుంటున్నారని, స్థానికులకు అవకాశం ఇవ్వకుండా ఇతర ప్రాంతాల వారిని డబ్బులు తీసుకొని నియమిస్తున్నారని కావున మీరు ఈ వ్యవహారం సిబిఐ , మరియు సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ తో విచారణ చేయించాలని కోరామని పేర్కొన్నారు.పేద ప్రజల సౌకర్యార్థం కోసం ఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీగా మార్చి పేద , మధ్యతరగతి వారికి నాణ్యమైన వైద్యాన్ని అందించాలని విజ్ఞప్తి చేశామన్నారు. నూతనంగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆర్టీసి డిపో లేని కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని . కావున ప్రభుత్వంతో చర్చించి జిల్లా కేంద్రంలో ఆర్టీసి డిపో ఏర్పాటుచేయాలనిగవర్నర్ కు ఫిర్యాదు.  లేఖలో దినేష్ పేర్కొన్నారు.రాజ్ భవన్ ముందు ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్ సామాన్యులకు చాలా ఉపయోగపడుతోందని మద్దెల దినేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.