జగిత్యాల: అగ్ని ధార న్యూస్:
జిల్లాలో రోజు రోజుకి కోవిడ్ కేస్ లు పెరుగుతున్న నేపథ్యంలో DMHO, DPO మరియు మెడికల్ సూపరింటెండెంట్ తో. ఈ రోజు జిల్లా పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన జడ్పీ చైర్పర్సన్ దావ వసంతసురేశ్ .ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూఆశా వర్కర్స్ నుండి డాక్టర్ ల వరకు అందరూ కూడా సమయపాలన పాటించి, ప్రజలకు వైద్యం తో పాటు మనోధైర్యం అందించాలని DMHO ను ఆదేశించారు. కారోన కేసులు పెరిగినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి జిల్లా ప్రధాన ఆసుపత్రి సిద్ధంగా ఉండాలని మెడికల్ సూపరింటెండెంట్ ని ఆదేశించడం జరిగింది.అదేవిధంగా జిల్లాలో శానిటేషన్ ఉదృతం చేసి, మురికి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, దోమలు నీటి నిల్వలు లేకుండా గ్రామాల్లోని వాటర్ ట్యాంకులు కూడా పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని DPO ఆదేశించడం జరిగింది.గత సంవత్సరం లో కారోన కేసులు ఎక్కువ ఉన్న సందర్భంగా సేవలందించిన వైద్యులు, వైద్య సిబ్బంది మరియు అధికారులు ప్రజాప్రతినిధులు ఎదుర్కొన్న తీరు అభినందనీయమని అన్నారు. మళ్లీ అదేవిధంగా ప్రజల కు అండగా నిలిచి,అందరం కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు.ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సినేషన్ వేయించుకొని, వ్యక్తిగత శుభ్రత పపాటించాలని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో వైద్యరంగంలో అన్ని వసతులు కరోనా ను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నాయని అన్నారు.జిల్లాలో కారోన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ధైర్యంగా ఉండాలని,కారోన నిబంధనలు పాటిస్తూ సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.ఈ సమీక్ష సమావేశంలో జడ్పీ సీఈవో సుందర వరధారాజన్ DMHO శ్రీధర్ DPO హరికిషన్ మెడికల్ సూపరింటెండెంట్ సూదక్షణదేవి RMO రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
