పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఈరోజు ఆటో డ్రైవర్ల కు కరోనా పై అవగాహన కల్పించిన ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ …….. .. పెద్దపల్లి అగ్నిధార న్యూస్ బుధవారం రోజున ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ బస్టాండ్ వద్ద ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు కరోనా omicron వేరియంట్ నియమాల పైన అవగాహన పైన కల్పించారు. రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో కేసులు పెరుగుతున్న దృశ్య ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు అందరూ డ్రైవర్లు మాస్కులు వాడాలని ఆటోలో ప్రయాణించే ప్రయాణికులు ఆటో డ్రైవర్లు ప్రయాణికుల నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత చేతులను శానిటైజర్ చేసుకోవాలని ఆటో ఎక్కే ప్రయాణికులు కూడా మాస్కులు వాడాలని అదేవిధంగా వాహనదారులు కూడా మాస్కులు సోషల్ డిస్టెన్స్ ఉండాలి అన్నారు. తప్ప గుంపులు గుంపులుగా ఉండవద్దని అలా ఉంటే వైరస్ వ్యాప్తి చెందుతుందని అన్నారు. అదేవిధంగా ప్రజలందరూ మూడో బూస్ట్ వ్యాక్సిన్ 60 సంవత్సరాలు పైబడినవారు ఫ్రంట్ వారియర్స్ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలందరూ కరోన నియమాలు పాటించి వైరస్ వ్యాప్తిని దూరం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు .
