పెద్దపెల్లి జిల్లా అగ్నిధార న్యూస్ గురువారం రోజున పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి మండలం బొంపల్లి నుంచి రాగినేడు మీదుగా కుర్మపల్లి వరకు PMGSY నిధులు రూ 2 కోట్ల 48 లక్షలతో నిర్మాణం చేపట్టనున్న తారు రోడ్డు నిర్మాణపనులకు శంఖుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తూ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. రాగినేడు నుండి కురుమపల్లి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడమే కాకుండా ఏళ్లతరబడి ప్రజా రవాణా వ్యవస్థకి అసౌకర్యంగా ఉన్నటువంటి రహదారి ప్రజలందరికి అందుబాటులోకి తెచ్చి రాకపోకలను సౌకర్యవంతం చేయడం ఈ ప్రాంత ప్రజల చిరు కాల వాంఛ అన్నారు. అది నేడు నెరవేర్చినందుకు సంతోషాన్ని కలిగిస్తోందన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బండారి రామ్మూర్తి,రైతు బంధు మండలాధ్యక్షులు అనంతరెడ్డి, AMC ఛైర్మెన్ శంకర్ నాయక్,సర్పంచ్ లు లక్ష్మయ్య,దాతు సదయ్య,ఎంపీటీసీ  ఏడెల్లి శంకర్ , నిర్మల-శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఉరడి,వీరేశం,మాజీ సర్పంచ్ కొంరేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు బందారి భూమయ్య, అరికిల్ల స్వామి, మల్లారెడ్డి, కనకయ్య, లక్ష్మణ్, నర్సయ్య, కనకరాజం,లింగయ్య, రాయపోచం, సతీష్, సాగర్,     PR,EE మునీరాజ్ DE శంకరయ్య,తెరాస ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.