జగిత్యాలజిల్లా,అగ్నిధారన్యూస్: ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి పట్టణ కేంద్రంలో గురువారం రోజు సంక్షేమ శాఖ మంత్రి  కొప్పుల  ఈశ్వర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. పట్టణంలోనివార్డులలోపనులనుపరిశీలించారు. .అనంతరం 1 కోటి 70 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించబోయే గిరిజన బాలుర నూతన వసతి గృహ  భవన నిర్మాణా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని పేద  మధ్యతరగతి ధనిక వర్గాల ప్రజానీకం అనే తారతమ్యం లేకుండా విద్యార్థినీ విద్యార్థుల కోసం రాష్ట్రంలో విద్యారంగ వ్యాప్తికి ప్రభుత్వం కట్టుపడి ఉండి ఎంతగానో కృషి చేస్తుందన్నారు. విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి,వారి చదువుల ఉన్నతికి కృషి చేస్తున్నామన్నారు. సర్వహంగులతో పాఠశాలలు నిర్మించి  రెసిడెన్షియల్ వసతులు కల్పించి నాణ్యమైన  ఆహారం అందించడమే కాకుండా నిష్ణాతులైన ఉపాధ్యాయుల చేత విద్యా బోధన అందిస్తున్నామన్నారు దీనిని విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగ పరచుకొని చదువులో రాణించాలని అన్నారు .ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తమ్మ, ఎంపీపీ ఎడ్ల చిట్టి బాబు, జెడ్పీటీసీ బత్తిని అరుణ, మాజీ మార్కెట్ చైర్మన్ అయ్యోరి రాజేష్, వైస్ ఎంపీపీ గడ్డం మహిపాల్, మరియు కౌన్సిలర్లు, స్థానిక నాయకులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.