నిషేదిత పొగాకు ఉత్పత్తులు పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు .                                                       పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు యంత్రాంగం ,టాస్క్ ఫోర్స్ పోలీసుల సమన్వయంతో కచ్చితమైన సమాచార వ్యవస్థతో జిల్లాలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు పట్టుకోవడంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దూకుడు పెంచి ఎక్కడికక్కడ కేసులు నమోదు    చేస్తూ అక్రమ వ్యాపారం చేసే వ్యక్తులలో గుబులు పెంచుతున్నారు.ఈ క్రమంలో  పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామం లో నిషేదిత పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నారు, అనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్,సిబ్బంది చంద్రశేఖర్, రవి తో కలిసి సబ్బితం లో అవ్వ ప్రసాద్ యొక్క కిరాణం లో తనిఖీ నిర్వహించగా రూ: 6,900 రూపాయల విలువ గల ప్రభుత్వ నిషేదిత పొగాకు ఉత్పత్తులు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకొని షాప్ యజమాని అయిన అవ్వ ప్రసాద్ s/o శంకరయ్య ,50yrs,R/o, వైశ్య, సబ్బితం ని అదుపు లోనికి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది. బసంత నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.