పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్:పెద్డపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో గురువారం రోజున బస్టాండ్ ఆవరణలో ప్రజల సౌకర్యార్థం కోసం బస్ డిపో ఏర్పాటు చేయాలని నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, జిల్లా కార్యవర్గ సభ్యులు కె.కనక రాజ్, మద్దెల దినేష్ లు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో బస్ డిపో లేక పోవడం వల్ల జిల్లా చుట్టూ ప్రక్కన ఉన్న మండలాల్లోని గ్రామాలు నిర్ణిత సమయంలో బస్ లు వెళ్ళాక పోవడం వల్ల ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గతంలో పెద్దపల్లిలో ఏర్పాటు కావాల్సిన బస్ అప్పటి స్పీకర్ మంథని నియోజకవర్గానికి తరలించుకపోవడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏండ్లు గడుస్తున్న జిల్లా కేంద్రంలో బస్ డిపోను ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి ధోరణికి నిదర్శనం విమర్శించారు. పెద్దపల్లి జిల్లా సిపిఐ పక్షాన ఆర్టీసీ ఎం డి డాక్టర్ సజ్జనర్ మరియు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కి ట్విట్ ద్వారా తెలియజేయడం జరిగిందన్నారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.త్వరలోనే వారిని నేరుగా కలవడం జరుగుతుందని తెలిపారు.జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేసేంతే వరకు సిపిఐ పక్షాన దశల వారి ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్నిహెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి చంద్ర గిరి ఉదయ్ ఈర్ల రాoచందర్, మాచర్ల శంకర్, విట్ఠల్, రాజ్, నరేష్, తదితరులు పాల్గోన్నారు.
