మా ప్రతినిధి  వోల్లాల  జలంధర్ గౌడ్     జగిత్యాలజిల్లా,అగ్నిధారన్యూస్:జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ కు చెందిన తెరాస నేత చెదలు రాజేందర్ (48) అతడి వ్యవసాయ భూమిలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్య గురి అయ్యాడు. మృతుడు రాజేందర్ మూడేళ్ళ క్రితం అదే గ్రామానికి చెందిన వ్యక్తిపై తుపాకితో కాల్పులు జరిపిన సంఘటనలో ప్రధాన నిందితుడని తెలిసింది.  భూతగాధాలు ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇబ్రహీంపట్నం పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాగా రాజేందర్ దారుణ హత్య గ్రామంలో కలకలం రేపింది.