అగ్నిధారన్యూస్ పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలో శుక్రవారం సాయంత్రం 6.30లకు పెను అగ్ని ప్రమాదం తప్పింది. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది. వివరాల్లోకి వెళితే పెద్దపల్లి పట్టణంలో కమాన్ చౌరస్తా రాజీవ్ రహదారి మార్గం వెంట జకోటియా పెట్రోల్ బంక్ పక్కన తాజ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో సిలిండర్ గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మంటలతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. నిర్వాహకులకు చోదకులకు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు .సకాలంలో స్పందించిన అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మండుతున్న మంటలతో పాటు పక్కనే ఉన్న మరో రెండు గ్యాస్ సిలిండర్లు మరోపక్క జకోటియా పెట్రోల్ బంక్ అన్నిటిని అంచనావేసి చాకచక్యంగా మంటలను అర్పించి భారీ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా అగ్నిమాపక అధికారులు పెన్ను ప్రమాదాన్ని తప్పించారు .ఈ సంఘటనలో 5000 రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ తెలిపారు . రాజీవ్ రహదారి పక్కనే కావడంచేత ట్రాఫిక్ సమస్య తలెత్తి ఈ క్రమంలో ఎస్ ఐ సహదేవ్, ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చేశారు.
