మంచిర్యాల,అగ్నిధారన్యూస్: పచ్చని చెట్లు ఏ కదా ప్రకృతి అందం పచ్చని చెట్లు ఏ కదా ప్రతి జీవికి మూలం ఇలాంటి చెట్లని నరుక్కుంటూ వెళితే ఎట్లా అంటూ ప్రకృతి ప్రేమికులు ప్రశ్నించడమే కాకుండా, చెట్టును పట్టుకొని చెట్లపై తమకు ఉన్న ప్రేమని బాధని వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల నడి ఒడ్డున ఉన్న ప్రశాంత మైన వాతావరణంతో జీవ వైవిధ్యానికి నిలయంగా ఉన్న I.B చౌరస్తా విశ్రాంతి భవనం యొక్క ఆవరణంలో సమీకృత మార్కెట్ కోసం ఎంపిక చేసిన స్థలం లో ఉన్న సుమారు 50.సంవత్సరాలుగా ఎంతో మంది సేద తీరుతున్న చెట్లను నరకడం చాలా విచారకరం అని మంచిర్యాల వృక్ష ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆమహా వృక్షాలను నరక కుండ వాటిని ట్రాన్స్ లొకేషన్ పద్దతిలో వేరే స్థలంలోకి చేర్చాలని కోరుతున్నారు.
