రామగుండం అగ్నిధార న్యూస్  గోదావరిఖని చౌరస్తాలో భోగిమంటల కార్యక్రమం నిర్వహించారు.  తెలంగాణ జాగృతి యువజన విభాగం రామగుండం నియోజకవర్గ యూత్ కన్వీనర్ వేగండ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు కోరుకటి చందర్ నగర మేయర్ బంగి అనిల్ కుమార్ పాల్గొని భోగి మంటలు వెలిగించారు..ఈ సందర్భంగా రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ ప్రజల అందరి కష్టాలు    ఈ భోగి మంటల్లో పోసి కష్టాలు తొలగి సుఖ సంతోషాలతో వారి జీవితాలు వెలగాలని అలాగే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను మరియు భోగి మంటలలో నల్ల చట్టాలను ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వేలం పాటలను వెంటనే రద్దు చేయాలని ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలని అంతం కావాలని ఈ భోగిమంటల కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధికార ప్రతినిధి అందే సదానందం జిల్లా కోశాధికారి ఆవుల రాజేష్ నియోజకవర్గ కన్వీనర్ తోకల రమేష్ జాగృతి జిల్లా యూత్ కో కన్వీనర్ సకినాల ప్రతాప్ గర్రెపల్లి లక్ష్మణ్ రేగళ్ళ రాజేష్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు అచ్చ వేణు  నూతి తిరుపతి జావిద్ పాషా రోడ్డ సంపత్ పాలడుగుల కనకరాజు పంజా అశోక్ కిరణ్ జి అశోక్ కిషన్ గౌడ్ బొంపెల్లి తిరుపతి జనగామ మహేందర్ కే లక్ష్మయ్య కాసర్ల సంపత్ మేకల రాజేందర్ ఎడ్ల శివ పోరండ్ల సంతోష్ కార్తీక్ శ్రావణ్ తో పాటు తెలంగాణ జాగృతి టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.