దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు
.. ఐదుగురి అరెస్ట్
● రూ. 77,400 నకిలీ నోట్లు స్వాధీనం
●4 లక్షల విలువగల ఫేక్ కరెన్సీ తయారీ వస్తువులు స్వాధీనం.

పెద్దపల్లి,అగ్నిధారన్యూస్ :దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠా గుట్టును సుల్తానాబాద్ పోలీసులు ఛేదించారు. నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేయడంతో పాటు వారి వద్దనుండి 77,400 రూపాయల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసిపి కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎసిపీ సారంగపాణి కేసు వివరాలు వెల్లడించారు.

గత 4 నెలల క్రితం కాల్వశ్రీరాంపూర్ మండలం లో ఒక్క నకిలీ నోట్ వచ్చిందన్న సమాచారం మేరకు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ S. చంద్రశేఖర్ రెడ్డి IPS DIG  అదేశాలమేరకు, ACP పెద్దపల్లి  సమక్షంలో CI, SI సుల్తానాబాద్  ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసి నకిలీ నోట్లు చలామణి చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు SI సుల్తానాబాద్ మరియు సిబ్బంది శుక్రవారం సుల్తానాబాద్ పట్టణంలోని చెరువు కట్ట వద్ద మాటు వేసి పట్టుకోవడం జరిగింది..

           నిందితుల వివరాలు
*A-1* చల్లా రాయమల్లు s/o ఓదెలు, 64 సంవత్సరాలు, వడ్డెర, r/o కాల్వశ్రీరాంపూర్ (v) *A-2* కొమిరే రాజు s/o కనకయ్య, 32 సంవత్సరాలు, వడ్డెర, r/o GD నగర్, బసంతనగర్,
*A-3* దారంగుల వెంకటి @ వెంకటేష్ s/o వెంకటస్వామి, 40 సంవత్సరాలు, వడ్డెర, ఆర్/ఓ కాల్వశ్రీరాంపూర్ (v) & (Mdl)
*A-4* దుగ్యాల అనిల్ s/o సమ్మయ్య, 27 సంవత్సరాలు, ఎరుకల, r/o చిన్నరాతిపల్లి (v), కాల్వశ్రీరాంపూర్ (Mdl)
*A-5* పెండం నగేష్ s/o రామస్వామి, 31 సంవత్సరాలు, పద్మశాలి, r/o కాల్వశ్రీరాంపూర్ (v) 

స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లు, వసతులు:

1. Epson Eco Tan LI5150 back color (Printer) 1
2. Pantum M6518 (Black color) (Lamination) 1
3. 858A3+ Company(White Color) (Cutter) 1
4. J.K Copier A4 size(20 Bundles) (Papers) 20 Bundles
5. J.K. Excel Bond (1 Bundle) 1 Bundle
6. LG Power ‘x’ (Black Color) CPU 1
7. Systech (Monitor) (black Color) (Monitor) 1
8. ZEBRONIC (Black Color) (Key Board) 1
9. (Excelam) (Black Color & White Color) E Co-12 (Model) (Lamination) 1
10. Green Color Paper Roles (Shining) (Bundles) 2 Bundles
11. Epson 008 ink Bottle(Pink Color) 1 Bottle
12. Epson 008 ink Bottle(Blue Color) 2 Bottles
13. Epson 008 ink Bottle(Yellow Color) 1 Bottle
14. One Side Printed Copies(Rs. 500 Notes) 27 copies
15. Blue dots & Gandhi Image Printed Papers 74 Copies
16. Black Color Socket Fine(Company) 01
17. Fake Notes 77400/-

                   నేరం చేయు విధానం
పైన తెలిపిన నిందితులలో A1 రాజమల్లు గతంలో మావోయిస్ట్ పార్టీ లో పని చేసి 1987 లోనాటు బాంబులు చుట్టుతుండగా ప్రమాదవశాత్తు పేలి రెందు చేతులు మనికట్టువరకు పోయినాయి. అప్పుడు పోలీసులు అరెస్టుచేసి జైలుకు పంపినరు. జైలు నుంచి వచ్చినతరువత చాలా దొంగతనాలు చేసినాడు. 2018 సంవసరంలో కూడా నకిలీ నోట్ల కేసులో పొత్కపల్లి పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లినడు. అయిన అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. అతడి అల్లుడు అయిన A2 రాజు, అతడి కులస్థుడిన A3 వెంకటి, A4 అనిల్ తో కలసి మరల నకిలీ నోట్ల తయారీని ప్రారంభించాడు. గతంలో అరెస్ట్ అయినది చూసి ఇక్కడ అయితే అతడి పైన నిగ ఉంటాదని కరీంనగర్ కు మకాం మార్చి నకిలీ నోట్ల తయారీకి అవసరమైన కంప్యూటర్, ప్రింటర్స్, కటింగ్ వస్తువులు సుమారు 4లక్షలు వెచ్చించి కొనుగోలు చేసి కరీంనగర్ లోని మంకమ్మతోటలోని శ్రీనగర్ కాలనీ యందు ఫామిలీ రూమ్ అద్దెకు తీసుకుని A4 అనిల్ కుటుంభంను అద్దెకు ఉంచి అందులో నకిలీ నోట్ల తయారీ వసతులు పెట్టి నకిలీ నోట్లు ముద్రించి పెద్దపల్లి, గోదావరిఖని లో చలామణి చేయుటకు వెల్లుచుండగా నమ్మదగిన సమాచారంతో సుల్తానాబాద్ పోలీస్ వారుపట్టుకోవడం జరిగినది. వీరిదగ్గర నుండి 77,400 నకిలీ నోట్లని, పైన తెలిపిన 4 లక్షల విలువగల వసతులను స్వాధీనం చేసుకొనినది. ఈకార్యక్రమంలో CI ఇంద్రసేనారెడ్డి, SI ఉపేందర్ రావు, అశోకరెడ్డి పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

నిందితులను పట్టుకోవడం లో ప్రతిభాకనభరిచిన Si ఉపేందర్ రావు, అశోకరెడ్డి, ASi తిరుపతి, నాగయ్య, HC నవ్య, PCs సదానందం, సుధాకర్, నవీన్, అమిత్, ఫయాజ్, పోచాలు, గణేష్ లను సీపీ సర్, డీసీపీ సర్, ACP  నగతు రివార్డులు ఇచ్చి అభినందిచారు.