
అగ్నిధార: ప్రతినిధి,పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విజయదశమి పండుగ సందర్భంగా పలు వార్డుల్లో జమ్మిపూజ కార్యక్రమం లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో పాడిపంటలతో దిన దిన అభివృద్ధి చెందాలని కోరుకున్నారు విజయదశమి అంటే చెడుపై మంచికి జరిగేటటువంటి చిహ్నం అన్నారు మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ ప్రజలు బతుకమ్మ విజయదశమి పండుగను శాంతియుత వాతావరణంలో ఆహ్లాదకరమైన ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ బిక్షపతి, 5 వ వార్డు కౌన్సిలర్ పెంచల రమాదేవి శ్రీధర్ మరియు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు..
