పెద్దమ్మ తల్లి దయ ప్రజలందరి పై ఉండాలి
బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్.
కాల్వశ్రీరాంపూర్,అగ్నిధారన్యూస్: మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ శనివారం రోజు ముదిరాజుల ఆరాధ్య దైవం అయిన పెద్దమ్మ తల్లి బోనాలకు ముదిరాజు కులస్తుల ఆహ్వానం మేరకు కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి విచ్చేశారు. బిజెపి ఎమ్మెల్యే గా గెలుపొందిన తర్వాత మొదటిసారిగా మండలానికి రావడంతో బిజెపి నాయకులు, ముదిరాజ్ కులస్తులు బీసీ సామాజిక వర్గ నాయకులు ఈటల రాజేందర్ కు ఘన స్వాగతం పలికారు బస్టాండ్ నుంచి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆలయంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముదిరాజ్ గ్రామ శాఖ అధ్యక్షులు రణవేన శ్రీనివాస్ , సంఘ సభ్యులు ఈటల రాజేందర్ ను పూలమాలలతో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగాఈటెలరాజేందర్, మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని రైతులు మనోధైర్యంతో వుండేలా పెద్దమ్మ తల్లి చల్లని చూపు ప్రజలందరూ పై ఉండాలని వేడుకున్నట్లుగా తెలిపారు. కరొనా మహమ్మారితో దేశ రాష్ట్ర ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారని, మహమ్మారి వల్ల ప్రజలకు ఎలాంటి కీడు జరగకుండా ఉండాలని, వడగండ్ల వర్షాలు జనవరి మాసంలో రావడం ప్రకృతి వైపరీత్యం అని ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా పెద్దమ్మతల్లి చల్లని చూపు ప్రజలందరి పై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.జిల్లాలో శుక్రవారం వారం కురిసిన అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు వెంటనె నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం , ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, ముదిరాజ్ కులస్తులు బిజెపి నాయకులు బీసీ సామాజికవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
