అగ్నిధారన్యూస్( సుల్తానాబాద్ ):గురువారం రోజు సుల్తానాబాద్ ASI మనుపాటి తిరుపతి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి అనాధలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగ ముఖ్య అతిథులుగా సుల్తానాబాద్ ఎస్ఐ ఉపేందర్ రావు హాజరై తను మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని ,ఈరోజు మా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లో ASI విధులు నిర్వర్తిస్తున్న తిరుపతి పుట్టినరోజు సందర్భంగా అనాధలకు అన్నదానం చేయడం చాలా సంతోషమని ఇలా ప్రతి ఒక్కరు అనాధలకు వారి ఇంట్లో ఏ శుభకార్యమైనా పేదవారికి అన్నం పెడితే పుణ్యం వస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ తిరుపతిని ఉపేందర్ రావు అభినందించారు. గత 270 రోజులుగా అనాధలకు మరియు భిక్షాటన చేసే వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయం అని ఎస్సై ప్రత్యేకంగా ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ మహేష్ నల్లవెల్లి సుధాకర్,లక్ష్మణ్, కామని రాజేంద్రప్రసాద్,ఎనగంటి నరేష్, రాపోలు ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు
