కవ్వాల్ అభయారణ్యాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చాలి.
అగ్నిధారన్యూస్ ( నస్పూర్ ):ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్న కవ్వాల్ అభయారణ్యాన్ని పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా మారిస్తే అధిక ఆదాయం వస్తుందని స్థానిక ప్రజలు అంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో అభయారణ్యం విస్తరించి ఉంది. పుణ్యక్షేత్రాలు, జలపాతాలు ,సెలయేళ్లు ,పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి అభయారణ్యాన్ని పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.

నేతాజీ పోరాటం యువతకు స్ఫూర్తిదాయకం
.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర పాఠశాల మైదానంలో ఆదివారం వాకర్స్ క్లబ్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.మైదానం పరిసరాల్లో మొక్కలు నాటారు. అనంతరం వాకర్స్ క్లబ్ అధ్యక్షులు, సింగిల్విండో చైర్మన్ సందెల వెంకటేష్, మాట్లాడుతూ. దేశ స్వాతంత్ర్యానికి నేతాజీ చేసిన పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకం అన్నారు. ఆయన అడుగు జాడల్లో నేటి యువత పయనించాలని కోరారు.
