ఫోటోగ్రాఫర్స్ నూతన కమిటీ ఎన్నిక
ఫోటోగ్రాఫర్స్ సంఘం అధ్యక్షుడిగా యెల్ల రాజు,ప్రధాన కార్యదర్శి గా వినోద్ .
అగ్నిధారన్యూస్( సుల్తానాబాద్ ): ఆదివారం రోజున సుల్తానాబాద్ మండల ఫోటో వీడియో గ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా యెల్ల రాజు, ప్రధాన కార్యదర్శిగా బోయిని వినోద్, కోశాధికారిగా రాపోలు తిరుపతిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గౌరవ అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ , కట్ల తిరుపతి తెలిపారు ఏకగ్రీవ ఎన్నికలు నిర్వహించుటకు సహకరించిన సంఘసభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
నూతనంగా ఎన్నిక కాబడిన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఫోటోగ్రఫీ అనేది కేవలం వృత్తిగా ఎన్నుకోబడిందే కాకుండా సమాజంలోని జీవకోటి నన్నింటిని తన చేతిలో ఉన్న కెమెరాతో బంధించి మరచిపోని మధుర జ్ఞాపకాలని అందించేది ఫోటోగ్రఫీ వృత్తి అన్నారు. ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్లు ఫోటోగ్రఫీ వృత్తి పైన ముప్పేట దాడి చేసి ఉపాధి అవకాశాలను ఆర్థిక పరిస్థితులను దెబ్బతీసింది అన్నారు. అయినప్పటికీ నిలదొక్కుకొని ఫోటోగ్రఫీ వృత్తిని నమ్ముకొని జీవించేవాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు అన్నారు. కెమెరాకు రీలు చుట్టి ఫోటోలు తీసే కాలం నుండి నేటి డిజిటల్ ఫోటోగ్రఫీ వరకు ప్రజలు ఫోటోగ్రాఫర్,లను, ఆదరిస్తున్నారు అన్నారు.ప్రజలకు నాణ్యతతో కూడిన సేవలో అందించినట్లయితే ఫోటోగ్రఫీ వృత్తి అనేది కలకాలం ఉంటుందన్నారు
. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రెడ్డి భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోగుల విజయ్ కుమార్ ,జిల్లా గౌరవ సలహాదారులు పల్లెర్ల ఉదయ్,కుర్మ రమేష్ బాబు సతీష్,గంధం రాజేష్ ,,సంపత్,సంజీవ్ లతోపాటు పలువురు పాల్గొన్నారు.
