జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్

అగ్నిధార న్యూస్ { హైదరాబాద్ }: 73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా  హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో.సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జాతీయ జెండాను ఎగరవేసి,జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి,కొబ్బరి కాయలు కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయన్నారు అన్నారు. పరాయి పాలన నుండి విముక్తి పొంది, మనకు మనమే రచించుకున్న రాజ్యాంగ ఆమోద దినోత్సవం రోజున కుల మత భాషా ప్రాంత భేదాలు లేకుండా దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ అన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి కార్యాలయ అధికారులు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది జాతీయ జెండాకి గౌరవ వందన చేశారు. సిబ్బంది అనంతరం మిఠాయిలు పంపిణీ చేసి  శుభాకాంక్షలు తెలుపుకున్నారు.