అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):చందపల్లి గ్రామానికి చెందిన మాజీ వార్డ్ సభ్యులు రాజం కొమురయ్య, రాజం వెంకటేశం గత రెండు సంవత్సరాల క్రితం బిజెపి పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరారు .టిఆర్ఎస్ పార్టీలో ఉండలేక కొద్దిరోజులుగా టిఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలలో పాల్గొనక స్తబ్దంగా ఉండి, బిజెపి నాయకులు గుజ్జుల రామకృష్ణారెడ్డి పిలుపుమేరకు సొంతగూటికి ఈరోజు తమ అనుచరులతో కలిసి చేరారు. ఈ సందర్భంగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, వారికి బిజెపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజం కొమురయ్య రాజం వెంకటేశం మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా బిజెపి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నప్పటికీ, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి పిలుపుమేరకు బిజెపి పైన ఉన్న అభిమానంతో సొంతగూటికి రావడం జరిగిందన్నారు. ఇకనుండి బిజెపి పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ పార్టీకి ప్రజలకి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా పార్టీలోకి ఆహ్వానించిన రామకృష్ణారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి పిన్నింటి రాజు.సీనియర్ నాయకులు కాసర్ల జనార్దన్ రెడ్డి,ఠాకూర్ రాం సింగ్, చిలువేరు ఓదేలు, మండల అధ్యక్షులు పరుస సమ్మయ్య, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఫహీం, సీనియర్ నాయకుడు జంగా చక్రధర్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకుడు అక్కెపల్లి క్రాంతి, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
