అగ్నిధారన్యూస్ ( జూలపల్లి ): యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మనుమండ్ల శ్రీనివాస్ అధ్వర్యంలో శుక్రవారం రోజు జూలపల్లి మండల కేంద్రంలో  కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా.  పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య హాజరై సభ్యత్వ నమోదు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ,డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ప్రతీ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కంకణబద్దులై యుద్ద ప్రాతిపదికన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు .కాంగ్రెస్ పార్టీ లో సభ్యులుగా చేరిన  ప్రతీ ఒక్కరికీ రెండు లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు.అనంతరం పెద్దపల్లి యువజన కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు పూదరీ చంద్రశేఖర్ కీ శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో    జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పి యస్ విజయ్ కుమార్ నాయకులు  వేముల రాజు మహంకాళీ అంజయ్య  కోంకటి భూషణం చిదురు శ్రీనివాస్ చిదరు అంజయ్య  పెద్దిరెడ్డి కృష్ణారెడ్డి వడ్లురి అంజయ్య వేల్పుల లింగయ్య అనగోని సాయి నేరువట్ల హరీష్ సుమంత్ చింతమల్ల రాములు తది తరులు పాల్గోన్నారు. పూజారి చంద్రశేఖర్ కి సన్మానం చేస్తున్న ఈ లక్ష్మయ్య  పూదరి చంద్రశేఖర్ కి సన్మానం చేస్తున్న ఈర్ల