కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు .
అగ్నిధారన్యూస్ ( సుల్తానాబాద్ ): శుక్రవారం రోజు సుల్తానాబాద్ పట్టణ కేంద్రములోపెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం టి యస్.యం.డి. సి ల ద్వారా ఇసుక రీచ్ ల టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు…..పెద్దపల్లి నియోజకవర్గంలోని స్థానిక వనరులను వేరే ప్రాంతానికి తరలిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తాం అన్నారు. సుల్తానాబాద్ మండలంలోనిగొల్లపల్లి,గట్టెపల్లి,కదంబాపూర్,నీరుకుల్ల ,తొగర్రాయి గ్రామాలు మరియు ఓదెల మండలంలోని గుండ్లపల్లి,కనగర్తిమడకపొత్కపల్లి,రూపనారాయణపేట,ఇందుర్తి,,గుంపులగ్రామాలు,కాల్వ,శ్రీరాంపూర్,మండలంలోనిమీర్జంపేట,కిష్టంపేట,మొట్లపల్లి,చిన్నరాతుపల్లి,శ్రీరాంపూర్ గ్రామాల మీదుగా మానేరు నది ప్రవహిస్తుంది.స్థానిక అవసరాల నిమిత్తం 2015 వ సంవత్సరంలో రూల్ 3 ప్రకారంగా ఇసుకను పెద్దపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత సాండ్ టాక్సీ ఏర్పాటు చేసి దాదాపు 800 ట్రాక్టర్లు సాండ్ టాక్సి లో 25000 వేలు రూపాయలు డిపాజిట్ చెల్లించి రిజిష్ట్రేషన్ చేసుకొని ఇసుక రవాణ చేస్తూ ఉపాథి పొందుతున్నారు.ఇటీవల తేదీ 17 12 2021 రోజున మానేరు వాగులో నిర్మించే చెక్ డ్యామ్ లలో ఉన్న ఇసుకను 1,50,38,200 క్యూబిక్ మీటర్ల ఇసుకను తీయడానికి అనుమతించాలని కోరుతూటి యస్.యం.డి. సి కి నివేదిక ఇస్తే ఇసుకను లారీల ద్వారా తీయడానికి టి యస్.యం.డి. సి వారు టెండర్లు పిలవడం జరిగింది.టి యస్.యం.డి. సి లారీల ద్వారా ఇసుక తీయడం టి.యస్.యస్.యమ్ రూల్స్ కు,వాల్టా చట్టానికి,రివర్ కన్సర్వేన్సి యాక్ట్ ,1884 ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, 1986 ,ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్ 1974 లకు విరుద్ధంగా ఎలాంటి సి.యఫ్.ఓ.సి.యఫ్.ఈ అనుమతులు లేకుండానే ఇసుకను మానేరు వాగు నుండి తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమస్య మానేరు వాగు పరిసర ప్రాంత వాసులకు అనుబంధంగా ఉన్న సమస్య కాబట్టి డి .యల్ .యస్.సి కమిటి కానీ చైర్మన్ అండ్ కలెక్టరు గారు కూడా ప్రజలతో కానీ మరియు ప్రజా ప్రతినిధులతో కానీ సమావేశం ఏర్పాటు చేయకుండానే వారి సమస్యలు తెలుసుకోకుండానే టెండర్లను పిలిచి ప్రజలను విస్మరించారు అన్నారు.
మడక గ్రామం వద్ద మానేరు వాగులో 10 కోట్లతో నిర్మించిన చెక్ డ్యాం మానేరు వాగు ప్రవాహ దాటికి మొత్తం కొట్టుకుపోయి 10 కోట్ల నష్టం వాటిల్లింది. మానేరు వాగు పరివాహక ప్రాంతంలోని గ్రామంలో రైతులు కష్టపడి తమ పొలాలను పండించుకోవడం
కోసం మానేరు వాగులో బావులు త్రవ్వి పైప్ లైన్ వేసుకొని నీటి పారకం చేసుకొని పంటలను పండించుకుంటున్నారు. ఇసుక తీయటం వలన వేల మంది రైతులకు కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లె ప్రమాదం వుంది అన్నారు .ఇసుక తీయటం వలన భూగర్భ జలాలు తగ్గి ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది.భవిష్యత్తులో పెద్దపల్లి జిల్లాలో నిర్మించే ప్రభుత్వ నిర్మాణాలకు కూడా ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది.చట్టాలకు విరుద్దంగా పిలిచినా టెండర్లను రద్దు చేయాలని తెరాస అధికార పార్టి నాయకులకు పరోక్ష సంబందాలున్నాయనీ తెలుస్తుందని ఎట్టి పరిస్తితుల్లో రద్దు చేయాలనీ లేని పక్షములో కాంగ్రెస్ పార్టి పక్షాన మానేరు వాగు పరివాహక ప్రాంత వాసులకు అండగా పోరాటాలకు సైతము వెనుకాడబోమని తెరాస పార్టి ఎంపి,,మంత్రి,ఎమ్మెల్లేలు,ఎమ్మెల్సీ లను ప్రభుత్వాన్ని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే విజయరమణరావు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అంతటి అన్నయ్య గౌడ్,మినుపాల ప్రకాష్ రావు, పట్టణ అధ్యక్షుడు వెగోళం అబ్బయ్య గౌడ్, మండల అధ్యక్షుడు చిలుక సతీష్,ఉట్ల వరప్రదీప్ ,పన్నాల రాములు, ఎండి రఫిక్,చింతల రాజు, సాయిరిమహేందర్,అమిరుశెట్టిరాయలింగు, దున్నపోతుల,రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.
