అతి తక్కువ మందితో ప్రయాణిస్తున్న బస్సులో అనుకోకుండా తప్పు జరిగే అవకాశమే ఉండదని కావాలని టికెట్ రేటు ఎక్కువ కొట్టారని ప్రయాణికులు వాపోతున్నారు.

అగ్నిధార న్యూస్ ( పెద్దపల్లి జిల్లా ): గోదావరి ఖని నుండి మేడారం వెళ్లి బస్సులో కండక్టర్ అవగాహన లోపం నిర్లక్ష్య వైఖరినా లేక ప్రజలపై బాదుడా ఏదేమైనప్పటికీ గోదావరిఖని డిపో నుండి మేడారం వరకు బస్సు చార్జీలు 200 రూపాయలుగా ఆర్టీసీవారు నిర్ణయించారు. ఈరోజు ఉదయం 9:30 కి  గోదావరిఖని డిపో నుండి మేడారం జాతరకి బయలుదేరిన బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురి ప్రయాణికుల వద్ద నుండి మాత్రం కండక్టర్ 200 రూపాయల కు బదులు ₹300 టికెట్ కొట్టి ప్రయాణికుల జేబులు కొట్టారని ప్రయాణికులు లబో దిబో మన్నారు. గోదావరిఖని నుండి. మంథిని కి చేరుకునేసరికి బస్సులో అతి తక్కువ  మంది ప్రయాణికులు ఉన్న నేపథ్యంలో బస్సు ని కాసేపు మంథని డిపోలో నిలుపుదల చేయడంతో ప్రయాణికులు కండక్టర్ తో వాగ్వాదానికి దిగారు.వేరే బస్సులోకి వెళ్తామని ప్రయాణికులు గొడవ పడ్డారు . గత్యంతరం లేక మంథని డిపో నుండి మేడారం జాతరకి బస్ ని స్టార్ట్ చేశారు. అందులో ప్రయాణిస్తు ప్రయాణికులు అగ్నిధార కు విషయం తెలపడంతో అగ్నిధార న్యూస్ గోదావరిఖని డి ఎం ని వివరణ కోరగా గోదావరిఖని నుండి మేడారం కి రెండు వందల రూపాయలు మాత్రమే పొరపాటున మేడారం స్పెషల్ బస్ చార్జి ₹300 టికెట్ కండక్టర్ ఇచ్చినాడు,అన్నారు. వంద రూపాయలు ప్రయాణికులకు తిరిగి ఇవ్వమని ఆదేశించామన్నారు. మంథని బస్టాండ్ నుండి మేడారానికి మరొక టికెట్ 165 రూపాయలు బస్ కండక్టర్ ఇవ్వడం కొసమెరుపు. ఈ విషయమై గోదావరిఖని ఆర్ టీ సి డి ఎం వెంకటేశం కండక్టర్ పై యాక్షన్ తీసుకుంటానన్నారు. ఓకే ప్రయాణికుడికి ఒకే బస్సులో గోదావరి ఖని నుండి మేడారం కు మరొక టికెట్ 300 రూపాయలు

మంథని నుండి ఇ మేడారం కి మరొక  టికెట్  165 రూపాయలు