అగ్ని ధార న్యూస్:( జగిత్యాల ): కొడిమ్యాల మండలంలోని నల్లగొండ గ్రామంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణము రథోత్సవము ఫిబ్రవరి 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరుగు కార్యక్రమములకు రావాలని ఆదివారం రోజున చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ ని బూరుగుపల్లి లోని వారి స్వగృహంలో నల్లగొండ నరసింహ స్వామి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి కొస్న కాంతారెడ్డి, ఆలయ అర్చకులు తో కలిసి స్వామివారి ప్రసాదం అందజేసి అర్చకులు ఆశీర్వచనం చేసి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ గ్రామ సర్పంచ్ పిల్లి మల్లేశం, తెరాస మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, నాయకులు చీకట్ల మహేష్ గౌడ్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.
