అగ్నిధారన్యూస్(  సుల్తానాబాద్ ):ఆదివారం ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, అవోపా ఆధ్వర్యంలో  సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్య వైశ్య భవన్ వద్ద గల మహాత్ముడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతిపిత గా పిలువబడుతున్నాడు అంటే  ఆయన భారత దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితం సర్వం త్యాగం చేసి శాంతియుత వాతావరణంలో  స్వాతంత్రం సిద్దించడం కోసం అనేక కష్టనష్టాలకోర్చి ప్రజలందరికీ స్వాతంత్రం సిద్ధింపదేశి పరమపదించడం విచారకరమన్నారు. అయినప్పటికీ భారత దేశ ప్రజలందరూ మహాత్మా గాంధీ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.   ఈ కార్యక్రమంలో శివాలయం చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, లోక్ అదాలత్ సభ్యుడు పల్ల కిషన్, వ్యాపార మండలి అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్, వాసవి క్లబ్ జోన్ చైర్మన్ ఎల్లంకి రాజన్న, వాసవి క్లబ్ అధ్యక్షులు యాంసానీ సంపత్ కుమార్, అవోపా ప్రధాన కార్యదర్శి కొమురవెల్లి భాస్కర్, కొమురవెల్లి కాశీపతి, ముత్యాల కిషన్, ముత్యాల రాములు, కొమురవెల్లి అంజన్న, వెనిశెట్టి ఉప్పుల అంజన్న, పల్ల భగవాన్, బొల్లం అశోక్, శివనత్రి ప్రసాద్, ఏల్లంకి రమేష్, కొమురవెల్లి సందీప్, నూక రాందాస్, రాంబాబు, రామిడి రవీందర్ పలువురు పాల్గొన్నారు.