రోడ్డు ప్రమాదాల నియంత్రణకు మరిన్ని చర్యలు ఏసీపీ సారంగపాణి
అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):శుక్రవారం రోజు పెద్దపెల్లి సబ్ డివిజన్ పరిధిలో బసంత్ నగర్ నుండి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బపల్లి వరకు పోలీస్, రవాణా, రోడ్డు భవనాల శాఖ, హెచ్ కె ఆర్ సంస్థ అధికారులు సంయుక్త కలిసి గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన 22 బ్లాక్ స్పాట్ లను గుర్తించి ప్రమాదాలకు గల కారణాలను తీసుకోవాల్సిన నివారణ చర్యలపై చర్చించారు.ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబ పెద్దలు మరణించి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఎంతో మంది క్షతగాత్రులై ఇబ్బందులు పడుతున్నారన్నారు, స్వయంకృతాపరాధం తప్పిదం, అతివేగం అవగాహన రాహిత్యంతో వాహనాలు నడపడం వల్ల తరచుగా యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపినారు. హెచ్ కె ఆర్, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ అధికారుల సమన్వయంతో ప్రమాదం జరిగిన మరియు బ్లాక్ స్పాట్స్ వద్ద ధర్మో ప్లాస్టిక్ పెయింట్స్, రేడియం స్టెడ్స్, బ్రింగ్ లెటర్స్, సైనింగ్ బోర్డ్స్,వేగ నియంత్రణ బోర్డు త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు . వేగ నియంత్రణ ప్రమాదాల నివారణ గురించిస్పీడ్ లేజర్ గన్ తో ప్రతిరోజు తనిఖీలు చేసి కేసు కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం సేవించిన అతి వేగంగా వాహనాలు నడిపిన కౌన్సెలింగ్, నిర్వహిస్తామన్నారు . అయినా మారని పక్షం
లో కేసులు నమోదు చేస్తామన్నారు.ఈకార్యక్రమంలో రోడ్డుభవనాల శాఖ డీఈ, జిల్లా రవాణా శాఖ రంగారావు, పెద్దపల్లి, సుల్తానాబాద్ సిఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు రాజేష్, ఉపేందర్, రావు మహేందర్, వెంకటకృష్ణ, ఎంవీ ఐ శ్రీనివాస్, హెచ్ కె ఆర్ ప్రతినిధులు రామకృష్ణతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
